AP: వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చరణ్‌తేజ అరెస్టు అయ్యారు. తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని భార్యపై దుష్ప్రచారం చేశారని చరణ్‌తేజపై టీడీపీ కార్యకర్త చింతకాని సురేష్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు చరణ్‌తేజను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజలను రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టారని కేసు నమోదు చేసినట్లు వారు వెల్లడించారు. నిందితుడి ఫోన్ స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిపారు.