AP: కడప కలెక్టరేట్‌లో యువకుడు ఆత్మహత్యాయత్నం చేశారు. తన భార్య చికిత్స పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని డీఎంహెచ్ వోకి విశ్వనాథరెడ్డి ఫిర్యాదు చేశారు. కానీ వైద్యాధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో, జాయింట్ కలెక్టర్ ఎదుటే విశ్వనాథ రెడ్డి శరీరంపై పెట్రోల్ పోసుకోవడంతో అక్కడ కోలాహలం నెలకొన్నది.