హైనా దాడి.. 65 గొర్రెలు మృతి, 25 గొర్రెలకు గాయాలు

54చూసినవారు
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు (M) మాచాపూర్ కి చెందిన పున్నం మల్లయ్య రోజువారిగా తన గొర్రెల మందను తన పొలం వద్ద వదిలి వెళ్ళారు. మల్లయ్య ఉదయం వచ్చి చూడగా హైనా దాడిలో 65 గొర్రెలు మృతి చెందగా మరో 20 గొర్రెలు గాయపడి ఉన్నాయి. వెంటనే మల్లయ్య గ్రామస్థులకు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన గొర్రెలకు చికిత్స అందించారు. గొర్రెల మంద పై దాడి చేసింది హైనా అనే అడవి జంతువుగా గుర్తించారు. సంఘటన ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్