TG: తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలపై బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రాణం ఉన్నంత వరకు పార్టీని విడిచి పెట్టేది లేదన్నారు. పక్క చూపులు చూస్తున్నానంటూ కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అలా చేయడానికి, తానేమీ కడియం శ్రీహరిని కాదన్నారు. ఎవరు పార్టీ మారినా.. తాను మాత్రం బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని, కేసీఆర్ వెంటే నడుస్తానని స్పష్టం చేశారు.