‘ప్రతి సినిమా చివరిదిగానే భావిస్తాను’ అని నటి సమంత అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ‘సాధారణ సినిమాలు ఎన్నో అంగీకరించొచ్చు. కానీ, నా జీవితంలో ప్రతి దానిని చివరిదిగా భావించే దశలో ఉన్నాను. కచ్చితంగా ప్రేక్షకులపై ప్రభావాన్ని చూపే వాటిని మాత్రమే ఎంపిక చేసుకుంటున్నా. వందశాతం నేను నమ్మకపోతే పాత్రలను చేయలేను. అలాంటి కథలను మాత్రమే అంగీకరిస్తున్నా’ అని సమంత చెప్పారు.