అన్నని అలా అడగటం నాకు నచ్చదు: అల్లు శిరీష్

52చూసినవారు
అన్నని అలా అడగటం నాకు నచ్చదు: అల్లు శిరీష్
సామ్ ఆంటోన్ దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'బడ్డీ' ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో ఆయన మాట్లాడుతూ 'నా సినిమాలను ప్రమోట్ చేయమని అన్నని ఎప్పుడూ అడగలేదు. నా సినిమాల్లో ఒక్క క్షణం ఆడియో ఫంక్షన్‌కు మాత్రమే అన్న హాజరయ్యారు. నా వెనుక ఉండి ప్రమోట్ చేస్తున్నాడనే భావన ప్రేక్షకులకు కలుగుతుందనిపించింది. అందుకే తనని సంప్రదించకూడదని పాలసీ పెట్టుకున్నా' అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్