తనకు ఒకరిద్దరు పిల్లలు చాలని హీరో నాగచైతన్య అన్నారు. రానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షోలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. "నాకు 50 ఏళ్లు వయసు వచ్చేసరికి పిల్లలతో సంతోషంగా ఉండాలని అనుకుంటున్నా. నాకు ఒకరిద్దరు పిల్లలు చాలు. నాకు కొడుకు పుడితే వాడిని రేస్ ట్రాక్‌కు తీసుకెళ్తా. కూతురు పుడితే తనకు ఎలాంటి హాబీలు ఉంటాయో వాటిని గుర్తించి ప్రోత్సహిస్తా. నాకు వాళ్లతో ఎక్కువ సమయం గడపాలని ఉంది." అని నాగచైతన్య తెలిపారు.