TG: గత దశాబ్ద కాలంగా ప్రగతిశీల ప్రభుత్వ విధానాల వల్ల దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు సైతం అనేక సందర్భాల్లో ప్రస్తావించారని గుర్తు చేస్తూ ఆయన మాట్లాడిన వీడియోను కేటీఆర్ పోస్టు చేశారు. 'థాంక్యూ సీబీఎన్ గారూ.. దయచేసి ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేని మీ పూర్వ శిష్యుడికి దీనిపై అవగాహన కల్పించండి' అని కేటీఆర్ రాసుకొచ్చారు.