AP: పెళ్లిలో భోజనం విషయంలో గొడవ.. కర్రలతో కొట్టుకున్నారు

70చూసినవారు
AP: పెళ్లిలో భోజనం విషయంలో గొడవ.. కర్రలతో కొట్టుకున్నారు
AP: పెళ్లి వేడుక అంటే అట్టహాసంగా చేసుకుంటారు. అయితే భోజనం వడ్డించే విషయంలో జరిగిన గొడవ కర్రలతో కొట్టుకునే వరకు దారి తీసింది. అనంతపురం జిల్లా గుత్తిలోని చెట్నేపల్లిలో సోమవారం రాత్రి ఓ వివాహ వేడుకలో భోజనం వడ్డించే విషయంలో గొడవ జరిగింది. ఈ ఘర్షణలో మహమ్మద్ రసూల్, నూర్ భాషా, రెహనా, మాబు, ఆసిఫ్‌లపై మరో వర్గం సభ్యులు కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్