ఆత్మీయ భరోసాపై హైకోర్టు కీలక ఆదేశాలు

64చూసినవారు
ఆత్మీయ భరోసాపై హైకోర్టు కీలక ఆదేశాలు
TG: పట్టణాల్లోని రైతు కూలీలకూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలనే వినతిపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గ్రామాల్లో ఎలాంటి భూమి లేని రైతు కూలీలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారని, మున్సిపాలిటీల పరిధిలో ఉండే వారికి అన్యాయం జరుగుతోందని కోర్టులో పిటిషన్ దాఖలైంది. గతంలో మున్సిపాలిటీల్లో పలు గ్రామాలను విలీనం చేశారని, రైతు కూలీలందరినీ ఒకేలా చూడాలని పిటిషనర్లు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్