తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాధిక మాట్లాడుతూ.. మేమప్పుడే పిల్లల్ని ప్లాన్ చేయలేదు, అయినా ప్రెగ్నెన్సీ వచ్చింది. అది తెలుసుకుని షాకయ్యాను. డెలివరీకి వారం ముందు ఒక ఫోటోషూట్ చేశాను. నేనేంటి? ఇలా కనిపిస్తున్నాను అని చాలా ఇబ్బందిగా ఫీలయ్యాను. ఒకరికి జన్మనివ్వడం గొప్ప విషయమే! కానీ ఈ క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎవరూ బయటకు చెప్పుకోకపోవడం నాకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది అని చెప్పుకొచ్చింది.