కోట్లు ఇచ్చినా ఆ యాడ్స్‌లో నటించను: సాయి పల్లవి

62చూసినవారు
కోట్లు ఇచ్చినా ఆ యాడ్స్‌లో నటించను: సాయి పల్లవి
సహజ నటి సాయి పల్లవి సినిమాల్లో మరియు నిజ జీవితంలో మేకప్ లేకుండా సహజంగా కనిపించడానికి ఇష్టపడుతుంది. అంతే కాకుండా ఆమె డాక్టర్ కావడంతో కాస్మెటిక్ ఉత్పత్తుల వల్ల చర్మానికి కలిగే నష్టాల గురించి బాగా తెలుసు. అందుకే ఓ కాస్మోటిక్ కంపెనీ ఓ అడ్వర్టైజ్‌మెంట్‌లో నటించమని ఆమెను సంప్రదించగా తిరస్కరించిందట సాయి పల్లవి. ఎన్ని కోట్లు ఇచ్చినా అటువంటి యాడ్స్ లో నటించడానికి ఇష్టపడనని ఆమె చెప్పేసిందట.

సంబంధిత పోస్ట్