బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్విమ్ సూట్ వేసుకోవడంపై ఆమె మాట్లాడుతూ.. ‘ఇండియాలో నేను బికినీ వేసుకోను. దేశం బయటకు వెళ్లినప్పుడు బికినీ వేసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎక్కడి నుంచి ఫోటో తీస్తారో చెప్పలేం. అందుకే ఇండియా వదిలి వేరే దేశానికి వెళ్లినప్పుడు మాత్రమే బికినీ వేసుకుని స్విమ్మింగ్ చేస్తాను.’ అని తెలిపారు.