హైదరాబాద్‌లోని మైలాన్‌దేవ్ పల్లిలో దొంగలు ఏటీఎం చోరీకి యత్నించారు. ఏటీఎం పగలగొట్టి నగదును చోరీ చేయడానికి విఫలయత్నం చేశారు. అయితే ఏటీఎం మిషన్ ఓపెన్ కాకపోవడంతో నిప్పు పెట్టి పరారయ్యారు. నిప్పు పెట్టడంతో రూ.7 లక్షల కరెన్సీ నోట్లు కాలిపోయాయి. ఈ ఘటపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.