శృతి హాసన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే 'ది ఐ' తో హాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఇటీవల వెల్లడించింది. తాజాగా ఈ వార్తలపై స్పందిస్తూ.. ఈ సినిమా కథ తన కోసమే రాసినట్లు అనిపించిందని, ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో భాగం కావడం గర్వంగా ఉందని తెలిపింది.