సముద్రం అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక్కొసారి రాకాసి అలలతో భయంకరంగా ఉంటుంది. అయితే తాజాగా ఓ సముద్రంలో విచిత్రమైన ఆకారంలో అలలు దర్శనమిచ్చాయి. చతురస్రాకారంలో ఏర్పడి భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఇవి బలమైన రిప్ టైడ్స్‌తో ముడిపడి ఉంటాయని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అలలు కనిపిస్తే వెంటనే సముద్రానికి దూరంగా వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.