ఘోర రోడ్డు ప్రమాదం.. 25 మంది మృతి (వీడియో)

58చూసినవారు
బొలివియాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్ ఢీకొన్న ఘటనలో 25 మంది మరణించారు. కొండపై నుంచి బస్సు లోయలో పడిపోయింది. ఈ క్రమంలో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ఒకచోట చేర్చారు. ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కుప్పలు కుప్పలు మృతదేహాలు ఉండటం స్థానికులను కలచివేసింది. కాగా, ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంలో 37 మంది మరణించారు.

సంబంధిత పోస్ట్