ప్రైవేట్ రంగ ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ యూపీఐ ఆధారిత సెక్యూర్డ్ క్రెడిట్ కార్డును విడుదల చేసింది. గ్లోబల్ కార్డ్ పేమెంట్ నెట్‌వర్క్ రూపే భాగస్వామ్యంతో ఫస్ట్ ఎర్న్ పేరుతో ఈ కార్డును బ్యాంక్ ప్రవేశపెట్టింది. అయితే వీటిని బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే కస్టమర్లకు జారీ చేయనున్నారు. వీటి ద్వారా లావాదేవీ చేసేవారికి క్యాష్‌బ్యాక్‌తో పాటు రివార్డులు ఉంటాయి. ఈ కార్డులను ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చు.