కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB) సమావేశం ముగిసింది. హైదరాబాద్‌లోని జలసౌధలో బోర్డు ఛైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఏపీ, తెలంగాణ మధ్య నీటి వాటా, బోర్డు నిర్వహణపై భేటీలో చర్చించారు. టెలిమెట్రిక్ స్టేషన్ల ఏర్పాటుపై ఇరు రాష్ట్రాల అభ్యంతరాలపై సమావేశంలో చర్చకు వచ్చింది. కృష్ణా జలాల్లో ప్రస్తుతం 66:34 నిష్పత్తి ప్రకారం కొనసాగిస్తామని బోర్డు ఛైర్మన్ తెలిపారు.