మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తన తోక మీదకు ఎక్కిన కారుపై ఓ కుక్క ప్రతీకారం తీర్చుకుంది. సాగర్‌లోని తిరుపతిపురం కాలనీలో ప్రహ్లాద్ సింగ్ ఘోషి అనే వ్యక్తి తన కారును రివర్స్ చేస్తున్నప్పుడు అనుకోకుండా అక్కడ ఉన్న కుక్క తోకను తొక్కించాడు. అతడు తిరిగి వచ్చి తన కారును పార్క్ చేసి ఇంట్లోకి వెళ్లాడు. అంతే, అప్పటి దాకా అక్కడే వేచి ఉన్న కుక్క తన గోళ్లతో కారును రక్కేసి గీతలు పెట్టింది.