సంధ్యా థియేటర్ ఘటనకు నేషనల్ మీడియా మద్దతిస్తోందని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు రావడంతో క్షమాపణ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానికి నరేశ్ అనే వ్యక్తి 'చేసిన తప్పును అంగీకరించడం గొప్ప విషయమని, అదే మిమ్మల్ని ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టింది.' అంటూ ట్వీట్ చేశాడు. దానికి 'నేను తప్పు చేశానని భావిస్తే నా హోంగార్డుకైనా సారీ చెప్పేందుకు వెనుకాడను' అని సీవీ ఆనంద్ రీట్వీట్ చేశారు.