ట్రంప్‌ గెలిస్తే వైట్‌హౌస్‌లోకి మస్క్‌

58చూసినవారు
ట్రంప్‌ గెలిస్తే వైట్‌హౌస్‌లోకి మస్క్‌
టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ను సలహాదారుడిగా నియమించుకోవాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యోచిస్తున్నట్లు సమాచారం. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందితే అడ్వైజర్‌ హోదాలో ఆయనను వైట్‌హౌస్‌కు ఆహ్వానించాలని నిర్ణయించారని విశ్వసనీయ వర్గాలను పేర్కొంటూ వార్తలు వెలువడ్డాయి. దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడలేదు. కానీ ట్రంప్‌, మస్క్‌ మాత్రం ఇప్పటికే పలు అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్