నేను ఎక్కడికీ వెళ్లట్లేదు: రిషి సునాక్‌

74చూసినవారు
నేను ఎక్కడికీ వెళ్లట్లేదు: రిషి సునాక్‌
త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల తర్వాత అమెరికా తరలి వెళ్లిపోతారంటూ తనపై జరుగుతున్న ప్రచారంపై బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునాక్‌ స్పందించారు. ఈ మేరకు ఆ వార్తలను తీవ్రంగా ఖండించారు. అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. తాను ఎక్కడికి వెళ్లిపోవడం లేదని.. బ్రిటన్‌ తన సొంత ఇల్లు అని స్పష్టం చేశారు. అమెర్‌శామ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో.. ఆ ఆరోపణలను కొట్టిపారేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్