అంతరిక్షంలో శూన్యత ఉంటుంది. అంటే గాలి, ఇతర ఏ పదార్థాలు అక్కడి వాతావరణంలో ఉండకపోవడంతో ఎంత గట్టిగా అరిచినా ఎవరికీ వినిపించదు. ధ్వని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లాలంటే ఒక మాధ్యమం అవసరం. అది భూమిపై ఉన్న వాతావరణంలో ఉంటుంది. దీంతో వ్యోమగాములు అంతరిక్షంలో రేడియో కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగించి మాట్లాడుకుంటారు.