శివలింగాన్ని ఈ ద్రవ్యాలతో అభిషేకిస్తే.!

2207చూసినవారు
శివలింగాన్ని ఈ ద్రవ్యాలతో అభిషేకిస్తే.!
శివుడు అభిషేక ప్రియుడని అందరికీ తెలుసు. అయితే, అభిషేకం కోసం వినియోగించే ద్రవ్యాల్లో ఒక్కోదానికి ఒక్కో విశిష్టత ఉందని పండితులు చెబుతున్నారు.
• ఆవు పాలతో అభిషేకిస్తే సర్వ సుఖాలతో వర్థిల్లుతారు, ఆవు పెరుగు, నెయ్యితో అభిషేకిస్తే ఆరోగ్యం, బలం, ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది.
• చెరకు రసంతో అభిషేకిస్తే దుఃఖం తొలిగి ఆకర్షణ పెరుగుతుంది. తేనెతో అభిషేకిస్తే తేజస్సు వృద్ధి చెందుతుంది.
• నువ్వుల నూనెతో అభిషేకిస్తే మృత్యు దోషం తొలగుతుంది. కొబ్బరి నీళ్లతో అభిషేకిస్తే సర్వ సంపద వృద్ధి కలుగుతుంది. అలాగే, అన్నంతో అభిషేకిస్తే సుఖ జీవనం కలుగుతుందని పండితులు పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్