తెలంగాణలో ఎండలు పెరిగిపోతున్నాయి. సమ్మర్ వస్తే ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంట్లో కూలర్, ఫాన్స్, ఏసీల వాడకం ఎక్కువ అవుతుంది. దీంతో కరెంట్ బిల్లు కూడా అధికంగా వస్తుంది. ప్రస్తుతం 200 యూనిట్స్ వరకు కరెంట్ వాడితే జీరో బిల్లు ఇస్తున్నారు. కానీ 200 యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ వాడితే బిల్లు కట్టాల్సిందే. ఎక్కువ కరెంట్ వినియోగిస్తున్న వారు కాస్త తగ్గించుకుంటే ఈ సమస్య దరిచేరదు.