గార్లిక్ టీ అంటే వెల్లుల్లిని ఉడికించి తయారు చేసిన ఒక రకమైన ఆరోగ్య పానీయం.వెల్లుల్లిలో ఉండే అలసిన్ అనే పదార్థం రోగ నిరోధక శక్తిని పెంచి, జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గిస్తుంది. వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తనాళాలను శుభ్రపరచి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.