చీర బిగువుగా కట్టుకోవడం వల్ల చర్మ క్యాన్సర్ ముప్పు ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మహారాష్ట్రలోని వార్ధలోని JNMC, బీహార్‌లోని మధుబని కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు ఇటీవల ఇద్దరు మహిళలు పార్శ్యంపై నొప్పితో వచ్చారు. వారిని పరీక్షించగా ఇద్దరికీ మార్జోలిన్ అల్సర్ అనే చర్మ క్యాన్సర్ ఉన్నట్టు గుర్తించారు. చీర లోపల వేసుకునే పెట్టికోట్‌ను నడుముకు బిగువుగా కట్టుకోవడం వల్లే చర్మ క్యాన్సర్ బారిన పడ్డారని వైద్యులు తెలిపారు.