AP: ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు పదో తరగతి బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడడంతో గర్భం దాల్చింది. షేక్ రబ్బానీ అనే వ్యక్తి బాధితురాలి తల్లితో గతకొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే బాలికపై కన్నేసి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరో వ్యక్తి చినబాబు అలియాస్ బాలు అనే వ్యక్తి కూడా ఈ దారుణానికి పాపడ్డాడని ఇద్దరిపై బాధితురాలి తల్లి పోలీసులు ఫిర్యాదు చేసింది. పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.