AP: రైతుల నుంచి ధాన్యం సేకరించే ప్రక్రియలో రైతులకు అనుకూలమైన అనేక సంస్కరణలు ప్రభుత్వం చేపట్టిందని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయిలో 32 లక్షల టన్నుల ధాన్యం రైతుల నుంచి సేకరణ చేసిందన్నారు. రైతులకు చెల్లించాల్సిన రూ.7,522 కోట్లకు గాను రూ.7,508 కోట్లను 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమచేయడం మరో రికార్డు అని ఉమా పేర్కొన్నారు.