రాహుల్ గాంధీకి కోర్టు కీలక ఆదేశాలు

51చూసినవారు
రాహుల్ గాంధీకి కోర్టు కీలక ఆదేశాలు
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి యూపీ సుల్తాన్‌పూర్‌లోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలపై దాఖలైన పరువునష్టం కేసులో జులై 26న తమ ముందు హాజరు కావాలని సూచించింది. మంగళవారమే కోర్టుకు ఆయన హాజరు కావాల్సి ఉన్నా పార్లమెంటు సమావేశాల్లో ఆయన పాల్గొనాల్సి వచ్చింది. దీంతో జూలై 26న రాహుల్ వ్యక్తిగత హాజరును కోర్టు షెడ్యూల్ చేసింది.

సంబంధిత పోస్ట్