HYDలోని ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు విధించడం అప్రజాస్వామికమని BRS మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. నిరసన తెలిపే హక్కును హరిస్తూ ఆంక్షలు విధించడం అమానుషమని చెప్పారు. 'ఓయూలో విద్యార్థుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యార్థుల సమస్యలకు పరిష్కారం చూపాలి. ఆంక్షల ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలి. అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం' అని పేర్కొన్నారు.