భార్యల వేధింపులతో భర్తలు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా యూపీలోని ముజఫర్ నగర్‌కు చెందిన మరొక వ్యక్తి భార్య వేధింపులు తట్టుకోలేక విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భార్య, అత్త కలిసి తనను చిత్రహింసలు పెడుతుండడం, రూ.12 లక్షలు డిమాండ్ చేయడంతో లైవ్‌లోనే విషం తాగాడు. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.