జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బెల్లంతో ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందని పండితులు చెబుతున్నారు. ఓ ఎర్రని బట్టలో బెల్లం ముక్క, నాణేలు వేసి ఓ మూటలా కట్టి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి 5 రోజులు పూజిస్తే ఆర్థిక బాధలు తొలగుతాయంటున్నారు. అలాగే 7 బెల్లం ముక్కలు, ఓ రూపాయి నాణెం, 7 పసుపు కొమ్ములు పసుపు గుడ్డలో కట్టి కోరికలు కోరుకుని గురువారం రైల్వే లైన్ వద్ద విసిరేస్తే అవి నెరవేరుతాయట.