5రోజుల్లో రూ. 3 లక్షల కోట్లు పెరిగిన మస్క్ సంపద!

75చూసినవారు
5రోజుల్లో రూ. 3 లక్షల కోట్లు పెరిగిన మస్క్ సంపద!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద 5 రోజుల్లోనే రూ.3 లక్షల కోట్ల మేర పెరిగింది. ఆయన సంస్థ టెస్లా షేర్లు భారీగా పుంజుకోవడమే ఇందుకు కారణం. మస్క్ ‌తాజాగా చైనాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘సెల్ఫ్ డ్రైవింగ్’ వ్యవస్థను అమలుచేసేందుకు చైనా ఆమోదం తెలిపిందన్న వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ట్రేడింగ్‌లో టెస్లా షేర్లు దూసుకెళ్లాయి. నిన్న ఒక్క సెషన్‌లోనే ఏకంగా 18.5 బిలియన్ డాలర్లు లాభపడటం విశేషం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్