వాతావరణశాఖ అప్డేట్.. తెలంగాణలోని 11 జిల్లాలకు భారీ వర్ష సూచన

50చూసినవారు
వాతావరణశాఖ అప్డేట్.. తెలంగాణలోని 11 జిల్లాలకు భారీ వర్ష సూచన
తెలంగాణలో 11 జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మెదక్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సోమవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్