స్పీకర్ పదవికి పోటీలో I.N.D.I. కూటమి

73చూసినవారు
స్పీకర్ పదవికి పోటీలో I.N.D.I. కూటమి
లోక్‌సభ స్పీకర్ పదవికి పోటీలో I.N.D.I. కూటమి నిలిచింది. కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ సురేష్ మంగళవారం స్పీకర్ పదవికి నామినేషన్ వేశారు. డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే ఏకాభిప్రాయానికి సహకరిస్తామని ప్రతిపక్షాలు చెప్పాయి. దీంతో అధికార, ప్రతిపక్ష కూటముల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. మరో వైపు NDA కూటమి తమ అభ్యర్థిగా మరోసారి ఓం బిర్లాను దించనుంది. ఆయన కాసేపటిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.

సంబంధిత పోస్ట్