ఇండియా కూటమి సమష్టిగా పని చేయాలి: ఖర్గే

50చూసినవారు
ఇండియా కూటమి సమష్టిగా పని చేయాలి: ఖర్గే
ఢిల్లీలోని అశోక్‌ హోటల్‌లో శనివారం నిర్వహించిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంటు లోపల, బయట సమష్టిగా పని చేయాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో లేవనెత్తిన అంశాలపై మాట్లాడటం కొనసాగించాలన్నారు. దేశంలో మోదీకి తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ సహా పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్