కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న ఇండియా కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. జులై 30న విపక్ష కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలుపుతామని ఆప్ తాజాగా ప్రకటించింది. మద్యం విధానం కేసులో అరెస్టయి ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ‘ఇండియా’ కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. ఆయన ఆరోగ్యం విషయంలో అధికార వర్గాల వైఖరిపై నిరసన తెలుపుతామని ప్రకటించింది.