ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 15 పరుగులకే ఔట్ అయ్యాడు. ఐదో ఓవర్లో కైల్ జేమీసన్ వేసిన మొదటి బంతికి క్యాచ్ ఇచ్చి హిట్ మ్యాన్ పెవిలియన్ చేరాడు. దీంతో 5.1 ఓవర్లకి టీమిండియా స్కోర్ 22/2గా ఉంది. శ్రేయాస్, కోహ్లీ క్రీజులో ఉన్నారు.