సిడ్నీ టెస్టు నుంచి రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చినా.. జట్టు ప్రదర్శనలో పెద్దగా మార్పు లేదు. ఓపెనర్లు త్వరగానే పెవిలియన్‌కు చేరారు. వన్‌డౌన్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (20) లంచ్ బ్రేక్‌కు ముందు ఔటయ్యాడు. ప్రస్తుతం తొలి సెషన్ ముగిసేసరికి టీమ్‌ఇండియా 3 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (4), యశస్వి జైస్వాల్ (10) విఫలమయ్యారు. విరాట్ కోహ్లీ (12*) నెమ్మదిగా ఆడుతున్నాడు. ఆసీస్ బౌలర్లు స్టార్క్, బోలాండ్, లైయన్ తలో వికెట్ తీశారు.