కొలంబో వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో 240/9 స్కోర్ చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో ఆవిష్క ఫెర్నాండో 40, వెల్లలాగే 39, కమిందు మెండిస్ 40, కుశాల్ 30 పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లలో సుందర్ 3, కుల్దీప్ 2 వికెట్లు పడగొట్టగా, సిరాజ్, అక్షర్ తలో వికెట్ తీశారు.