పారా ఛాంపియన్‌షిప్‌లో భారత్ ప్రపంచ రికార్డు

72చూసినవారు
పారా ఛాంపియన్‌షిప్‌లో భారత్ ప్రపంచ రికార్డు
వరల్డ్ పారా ఛాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల టీ20 రేసులో దీప్తి జీవన్‌జీ ప్రపంచ రికార్డుతో స్వర్ణం సాధించింది. జపాన్‌లోని కోబ్‌లో సోమవారం జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 400 మీటర్ల టీ20 కేటగిరీ రేసులో భారత క్రీడాకారిణి దీప్తి జీవంజీ 55.07 సెకన్లతో ప్రపంచ రికార్డుతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గతేడాది పారిస్‌లో జరిగిన ఛాంపియన్‌షిప్‌లో అమెరికాకు చెందిన బ్రెన్నా క్లార్క్ నెలకొల్పిన 55.12 సెకన్ల ప్రపంచ రికార్డును దీప్తి బద్దలు కొట్టింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్