భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య శనివారం రాత్రి టీ20 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లను పరిశీలిస్తే, మొత్తం 26 మ్యాచ్‌లలో భారత్ 14 గెలిచింది. మరో వైపు సౌతాఫ్రికా 11 మ్యాచ్‌లలో విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఈ రెండు జట్లు 6 సార్లు తలపడ్డాయి. భారత్ 4 మ్యాచ్‌లలో గెలుపొందగా, సౌతాఫ్రికా 2 మ్యాచ్‌లలో మాత్రమే గెలుపొందింది.