NEET పేపర్ లీక్ కేసులో CBI దూకుడు పెంచింది. ఈ స్కామ్‌లో ప్రమేయం ఉన్న మరో 10 మందిని అరెస్ట్ చేసింది. నిందితులంతా రాజస్థాన్‌కు చెందిన వారు. అరెస్ట్ అయిన విద్యార్థులు తమకు బదులుగా డమ్మీ అభ్యర్థులతో పరీక్ష రాయించినట్లు CBI విచారణలో తేలింది. ఈ కేసులో పలువురు నిందితులను CBI అరెస్ట్ చేస్తోంది. మరోవైపు జార్ఖండ్ హజారీబాగ్‌లో స్కూల్ ప్రిన్సిపాల్, పరీక్ష కేంద్రం సూపరింటెండెంట్‌ను CBI అదుపులోకి తీసుకుంది.