తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల యాప్ సర్వే 74 శాతం పూర్తయింది. ఈ ఇళ్ల కోసం ప్రభుత్వానికి ప్రజాపాలన కార్యక్రమంలో 80,54,554 దరఖాస్తులు రాగా.. ఇప్పటివరకు 59,89,889 దరఖాస్తులపై సర్వే నిర్వహించారు. సంక్రాంతి తర్వాత గ్రామసభలు ద్వారా లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయనున్నారు. ఈ జాబితా కలెక్టర్లు పరిశీలించాక ఇన్‌ఛార్జి మంత్రులకు పంపిస్తారు. ఇన్‌ఛార్జి మంత్రి ఆమోదం తెలిపితే లబ్ధిదారుల ఖాతాల్లో ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే నగదును విడతల వారీగా జమ చేస్తారు.