2022లో కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ అందుకున్న దాదాపు 2,000 మంది ఫ్రెషర్లను చేర్చుకోవడంలో ఇన్ఫోసిస్ ఆలస్యం చేస్తోందని మనీకంట్రోల్ నివేదించింది. ఈ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఇన్ఫోసిస్ లో సిస్టమ్ ఇంజనీర్ (SE), డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ (DSE) ఉద్యోగాలకు రూ.3.6 లక్షలు, రూ.6.5 లక్షల వార్షిక వేతనంతో ఎంపికయ్యారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఐటీ యూనియన్ NITES కోరింది.