అమానవీయ ఘటన.. కుక్కను కారుకు కట్టి లాక్కెళ్లారు(వీడియో)

72చూసినవారు
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన వీధికుక్కను ఓ వ్యక్తి తన కారు వెనుక కట్టేసి రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియోని కౌశిక్ కంటెచా (@kaushikdd) తన X ఖాతాలో ఒక పోస్ట్‌ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో చనిపోయిన కుక్కను ఇన్నోవా కారుకు కట్టేసి రోడ్డుపై నుంచి లాక్కెళ్లారు. దీంతో ఇలాంటి మృగాళ్లపై తగిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్