ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్లపై విచారణ

53చూసినవారు
ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్లపై విచారణ
మద్యం కుంభకోణం వ్యవహారంలో ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో బెయిల్‌ మంజూరు చేయాల్సిందిగా ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఆమె తరఫు న్యాయవాది విక్రమ్‌ చౌదరి వాదనలు వినిపించారు. నిబంధనలకు విరుద్ధంగా కవితను అరెస్టు చేశారని వాదించారు. అయితే, దీనిపై తమ వాదనలు వినిపించేందుకు ఈడీ తరఫు న్యాయవాది గడువు కోరారు. దీంతో తదుపరి విచారణను మంగళవారం మ.12 గంటలకు కోర్టు వాయిదా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్