సోషల్ మీడియా ప్రేమలు ప్రాణాలు తీసుకునేలా చేస్తున్నాయి. తెలంగాణలోని హుజూరాబాద్‌కు చెందిన రాహుల్ (18), నిర్మల్ జిల్లాకు చెందిన శ్వేత(20) ఇన్‌స్టాలో ప్రేమించుకున్నారు. పెద్దవారికి భయపడి ఇద్దరూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే ఏపీలోని గుంటూరుకు చెందిన సాయికుమార్, గీతిక ఇన్‌స్టాలో పరిచయంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నెలల వ్యవధిలోనే గీతిక అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే భర్తే చంపాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.